Mon. Oct 13th, 2025
Peddi : రామ్ చరణ్ వర్కింగ్ స్టైల్‌ కు ఫిదా అయ్యా.. అంటున్న జాన్వీ

బాలీవుడ్ స్టార్ అండ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తెలుగులో ‘దేవర’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ, తాజాగా రామ్ చరణ్ – బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ లో హీరోయిన్‌గా నటిస్తున్నారు. తెలుగులో ఎంట్రీతోనే బాడా ఆఫర్ లు అందుకుంటున్నడంతో ఇక్కడ కూడా స్టార్ హోదా అందుకోడానికి ఎక్కువ సమయం పట్టదు అని చెప్పవచ్చు. అయితే, జాన్వీ ఒక మూవీ చేయాలనుకున్నప్పుడు వర్క్ విషయంలో అసలు కాంప్రొమైజ్ అవ్వరు, ముఖ్యంగా ప్రమోషన్స్ లో చాలా యాక్టివ్‌గా పాల్గొంటారు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో జాన్వీ ‘పెద్ది’ మువీ గురించి , దర్శకుడు బుచ్చిబాబు, చరణ్ వర్క్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకుంది.

Additionally Learn : GV Prakash – Saindhavi: జీవీ ప్రకాష్ & సైంధవి ప్రేమ కథకు ముగింపు పలికిన చెన్నై హైకోర్టు..

జాన్వీ మాట్లాడుతూ.. “పెద్ది మూవీ అనుభవం ఎంత గొప్పదో చెప్పలేను. బుచ్చిబాబు సనా గారితో పని చేయడం ఒక అదృష్టం. ఆయన ‘ఉప్పెన’ వంటి హార్ట్ టచ్చింగ్ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో నేను సాంప్రదాయ హీరోయిన్ పాత్రలో కాకుండా, భిన్నమైన, ఆసక్తికరమైన పాత్రలో కనిపించబోతున్నాను. ఈ పాత్ర నా కెరీర్‌కు మరింత బూస్ట్ ఇస్తుందని భావిస్తున్నాను. ప్రేక్షకులకు ఇది కచ్చితంగా నచ్చుతుంది” అని తెలిపారు. అలాగే రామ్ చరణ్ పై కూడా జాన్వీ ప్రశంసలు వెల్లువెత్తించారు – “రామ్ సర్ చాలా ఇష్టమైన నటుడు. ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా, సెట్‌లో ఒక విద్యార్థిలా ఉండటం, కష్టపడే తత్వం, ఎనర్జీ, అంకితభావం చూపుతూ పని చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఆయనతో స్క్రీన్ షేర్ చేయడం నా అదృష్టం. ఆ సెట్‌లో తిరిగి ఎంట్రీ ఇవ్వడం కోసం ఎదురుచూస్తున్నాను” అని జాన్వీ పేర్కొన్నారు.