Published on Dec 13, 2024 8:02 AM IST
కోలీవుడ్ సహా తెలుగులో కూడా మంచి ఫేమ్ ఉన్నటువంటి హీరోస్ లో టాలెంటెడ్ నటుడు సిద్ధార్థ్ కూడా ఒకడు. మరి సిద్ధార్థ్ తెలుగులో సినిమాలు ఆపేసినప్పటికీ చిత్రాలకి మాత్రం మన దగ్గర సాలిడ్ క్రేజ్ ఉంది. దీనితో పలు చిత్రాలకి తెలుగులో రీరిలీజ్ కి వచ్చి మంచి రెస్పాన్స్ కూడా అందుకున్నాయి. కానీ తన నుంచి కొత్త సినిమాలు మాత్రం ఒకింత స్ట్రగుల్ అవుతున్నాయి.
దీనికి తోడు మన టాలీవుడ్ స్టార్స్ పై సిద్ధార్థ్ చేస్తున్న కామెంట్స్ కూడా ఇపుడు చర్చకి దారి తీశాయి. రీసెంట్ గానే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” పాట్నా ఈవెంట్ పై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. జేసీబీలో నలుగురు జనాలని తీసుకొచ్చి పోగేసి ఉంటారు అంటూ చేసిన కామెంట్స్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సహా టాలీవుడ్ ఆడియెన్స్ ని కూడా హర్ట్ అయ్యారు.
ఇక ఈ గ్యాప్ లోనే తన లేటెస్ట్ చిత్రం “మిస్ యు” తెలుగులో కూడా రిలీజ్ కి వచ్చింది. అయితే ఈ చిత్రానికి మన తెలుగులో థియేటర్స్ కి జనం లేరు టికెట్స్ కూడా తెగడం లేదు. దీనితో సిద్ధార్థ్ సినిమా కోసం ఇపుడు జేసీబిలో జనాలు వస్తున్నారు చాలా మంది అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ తనపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇలా తన మాటలు మళ్ళీ తనకే ఎఫెక్ట్ చూపించాయి అని చెప్పాలి.