టీవీ సీరియల్ నటిని వేధించిన కేసులో యువకుడు అరెస్ట్ అయ్యాడు. ప్రేమ, పెళ్లి పేరుతో సీరియల్ నటిని వేధింపులకు గురి చేశాడు బత్తుల ఫణితేజ అనే యువకుడు. శ్రావణ సంధ్య అనే టీవీ సీరియల్ లో నటిస్తున్న మహిళను అదే యూనిట్ లో పనిచేస్తున్న బత్తుల ఫణి తేజ వేధింపులకు గురి చేశాడు. ఈ క్రమంలో అతను మానసిక వేధింపులకు గురిచేస్తున్నాడని బాధితురాలు జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసులు నమోదు చేసిన తర్వాత భాదితురాలితో కాళ్ళ బేరానికి వచ్చిన ఫణి తేజ, నా నోటి దూల వలన ఇలా చేశాను అని సెల్ఫీ వీడియో ను సీరియల్ నటికి పంపాడు సదరు నిందితుడు. అయితే ఆమె కేసు వెనక్కి తీసుకోక పోవడంతో, బాధితురాలు క్యారెక్టర్ ను దిగజార్చేవిధంగా దుష్ప్రచారం చేయడంతో ఫణి తేజ ను అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు పోలీసులు.