Dil Raju : రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలతో గేమ్ ఛేంజర్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’  ప్రీ రిలీజ్ ఈవెంట్‌  డల్లాస్‌లో గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత దిల్ రాజు కీలక వ్యాఖ్యలు చేసారు.

దిల్ రాజు మాట్లడుతూ “1998లో ఒకే ఒక్కడు సినిమాతో మా జర్నీ ప్రారంభం అయింది. శంకర్ , చంద్రబాబు గారి చేతుల మీదుగా వంద రోజుల షీల్డ్ తీసుకున్నాం. శంకర్ గారు నిర్మించిన వైశాలి మూవీని తెలుగులో రిలీజ్ చేశాను. శంకర్ గారు మాతో సినిమా చేయాలని, తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. రామ్ చరణ్ కు శంకర్ కు కథ చెప్పడం, నచ్చడం అలా జర్నీ మొదలైంది. మా బ్యానర్లో ఇది 50వ సినిమా. ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు.  సాంగ్ వేనుమా సాంగ్ ఇరుక్కు, ఫైట్ వేనుమా ఫైట్ ఇరుక్కు, సంక్రాంతికి సూపర్ హిట్ ఇరుక్కు. రామ్ చరణ్, సూర్య గారికి మధ్య జరిగే సీన్లు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి. రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలు చాలా కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ల క్రితం శంకర్ గారు రాసుకున్నారు. అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి. ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్‌ పెద్ద హిట్ కాబోతోంది. గేమ్ చేంజర్‌తో పాటుగా సంక్రాంతికి వస్తున్నాం తీసుకురమ్మని చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు సపోర్ట్ ఇచ్చారు. బాలయ్య బాబు డాకు మహారాజ్ చిత్రం కూడా రాబోతోంది. పండుగకు రాబోతోన్న అన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వాలి’ అని అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *