
బాలీవుడ్ బ్యూటీ పూనమ్ పాండే మరోసారి వార్తల్లో నిలిచింది. ముంబై వీధుల్లో అభిమాని ఒకరు ఆమెను అనుచితంగా తాకడానికి ప్రయత్నించగా, ఈ ఘటన వీడియో వైరల్‌గా మారింది.
ముంబై వీధుల్లో ఫోటోషూట్ చేస్తున్న పూనమ్ పాండేకు ఓ అభిమాని వచ్చి సెల్ఫీ అడిగాడు. ఆమె ఓకే చెప్పినప్పటికీ, ఆ వ్యక్తి మరీ దగ్గరగా వచ్చి ముద్దు పెట్టేందుకు ప్రయత్నించాడు. భయంతో పూనమ్ పాండే వెనక్కి తప్పుకుంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట చర్చనీయాంశంగా మారింది.
అయితే, నెటిజన్లు దీనిపై విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు అభిమాని ప్రవర్తనను ఖండిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు, పూనమ్ పాండే గతంలో ఎన్నో ఫేక్ స్టంట్స్ చేసిందని, ఇదీ అలాంటి పబ్లిసిటీ గిమ్మిక్కే అయ్యుంటుందని నెటిజన్లు అంటున్నారు.
పూనమ్ పాండే వివాదాలతో మళ్లీ వార్తల్లోకి రావాలనే ఉద్దేశంతోనే ఇలా చేసిందని కొందరు ఆరోపిస్తున్నారు. అంతకుముందు కూడా, తన మరణంపై తానే ఫేక్ న్యూస్ ఫ్లాష్ చేయడం చర్చనీయాంశం అయ్యింది.
ఈ ఘటన నిజమేనా లేక పబ్లిసిటీ స్టంట్ మాత్రమేనా? దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే, పూనమ్ పాండే మళ్లీ వివాదాలతో బిజీగా మారిన విషయం మాత్రం నిజం.