ఓటీటీ స్ట్రీమింగ్‌కి వచ్చేసిన ‘పొట్టేల్’ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 20, 2024 5:03 PM IST

టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశతో తెరకెక్కిన మూవీ ‘పొట్టేల్’ అక్టోబర్ 25న గ్రాండ్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు సాహిత్ మోత్కూరి డైరెక్ట్ చేయగా, ఈ సినిమాలో యువ చంద్ర, అనన్య నాగళ్ల ముఖ్య పాత్రల్లో నటించారు. ప్రమోషన్స్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డీసెంట్ హిట్‌గా నిలిచింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహా, అమెజాన్ ప్రైమ్ వీడియోలో ‘పొట్టేల్’ సినిమా నేటి నుంచి స్ట్రీమింగ్‌కి వచ్చేసింది. డ్రామా థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా కథ ఓటీటీ ప్రేక్షకులను ఖచ్చితంగా ఆకట్టుకుంటుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమాలో అజయ్, నోయెల్, ప్రియాంక శర్మ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. శేఖర్ చంద్ర సంగీతం అందించిన ఈ సినిమాను నిశాంక్ రెడ్డి, సురేశ్ కుమార్ ప్రొడ్యూస్ చేయగా.. మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *