‘ది రాజా సాబ్’ పండుగ అప్డేట్.. మారుతీ క్లారిటీ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 20, 2024 8:09 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు వరుసగా పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు మారుతితో చేస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ “ది రాజా సాబ్” కూడా ఒకటి. మరి ప్రభాస్ ని మళ్ళీ వింటేజ్ మోడ్ లో చూపించే విధంగా ప్లాన్ చేస్తున్న ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ని మేకర్స్ ఒకొకటిగా వదులుతూ వస్తున్నారు.

మరి ఈసారి ప్రభాస్ బర్త్ డే కానుకగా అయితే ఓ ట్రీట్ ని లేటెస్ట్ గా కన్ఫర్మ్ చేసేసారు. మరి డార్లింగ్ బర్త్ డే కానుకగా అయితే ఓ సరికొత్త స్టిల్ ని ప్రభాస్ పై విడుదల చేస్తున్నట్టుగా నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అలాగే దర్శకుడు మారుతీ కూడా కన్ఫర్మ్ చేసేసారు. దీనితో ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23కి ఆల్రెడీ ఓ ట్రీట్ ఖరారు అయ్యిపోయింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *