ఇమాన్వికి బ్యూటిఫుల్ విషెస్ చెప్పిన మేకర్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా ఇప్పుడు చేస్తున్న భారీ చిత్రాల్లో దర్శకుడు హను రాఘవాపుడితో చేస్తున్న భారీ ప్రాజెక్ట్ కూడా ఒకటి. మరి గత కొన్నాళ్ల కితమే అఫీషియల్ గా అనౌన్స్ చేసిన ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ చిత్రం షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానుండగా మేకర్స్ సోషల్ మీడియా సెన్సేషనల్ ఇమాన్వి అనే కొత్త అమ్మాయికి టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు.

అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యిన సమయంలోనే ప్రభాస్ పక్కన ఈ యంగ్ బ్యూటీ ఎంతగానో ఆకట్టుకుంది. ఇలా ఈ జంటని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇప్పుడు ఈ హీరోయిన్ బర్త్ డే వచ్చింది. దీనితో మేకర్స్ ఈమెకి బ్యూటిఫుల్ విషెస్ ని అందించారు. ఆమెపై ఒక అందమైన పోస్టర్ ని పెట్టి ఈమె ఈ చిత్రంలో మీ అందరినీ ఆశ్చర్యపరుస్తుంది అంటూ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని అందించారు. దీనితో ఆమెకి డార్లింగ్ ఫ్యాన్స్ విషెస్ చెబుతూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

The post ఇమాన్వికి బ్యూటిఫుల్ విషెస్ చెప్పిన మేకర్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *