ప్రభాస్ ‘ఫౌజీ’ అప్డేట్.. ఇప్పుడు లేదన్న మేకర్స్! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న చిత్రాలకు సంబంధించిన అప్డేట్స్‌తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. ఇప్పటికే దర్శకుడు మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రం నుండి ఓ సాలిడ్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌ని మేకర్స్ రివీల్ చేశారు. ప్రభాస్‌ని ఎవరూ ఊహించని విధంగా ఈ కొత్త పోస్టర్‌లో ప్రెజెంట్ చేయడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, దర్శకుడు హను రాఘవపూడి డైరెక్షన్‌లో ప్రభాస్ చేయబోయే సినిమా నుండి కూడా ఓ అప్డేట్ ఉంటుందని మేకర్స్ వెల్లడించారు. దీంతో ఈ అప్డేట్ ఏమై ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ నుండి అప్డేట్ లేదని.. మరో సందర్భంలో ఈ అప్డేట్ ఇస్తామని మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీంతో ఊరించి ఉసూరుమనిపించారుగా అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

ఇక హను రాఘవపూడితో ప్రభాస్ చేయనున్న చిత్రం పీరియాడిక్ మూవీగా తెరకెక్కనుందని.. ఇందులో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తాడని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయనున్నారట. ఇమాన్వి ఈ చిత్రంతో హీరోయిన్‌గా టాలీవుడ్‌కి పరిచయం కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు.

The post ప్రభాస్ ‘ఫౌజీ’ అప్డేట్.. ఇప్పుడు లేదన్న మేకర్స్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *