రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రెస్టీజియస్ మూవీ కల్కి 2898 ఎడి నుంచి ఇవాళ సాయంత్రం అప్డేట్ ఇవ్వబోతున్నారు మేకర్స్. ఈ సాయంత్రం 7.15 నిమిషాలకు ఈ అప్డేట్ రివీల్ చేస్తారు. అతను ఎవరో తెలుసుకునే టైమ్ వచ్చింది అంటూ కల్కి అవతారాన్ని పరిచయం చేయబోతున్నారు. అయితే ఈ అప్డేట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నారు. ఆయనే కల్కి టైటిల్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

కల్కి 2898ఎడి సినిమా రిలీజ్ డేట్ గురించి కూడా ఇవాళే అప్డేట్ ఉంటుందని అనుకోవచ్చు. ఈ సినిమా నెక్ట్ మంత్ 9న రిలీజ్ కావాల్సిఉండగా అది సాధ్యమయ్యేలా లేదు. జూన్ 20 లేదా జూలైలో కల్కిని రిలీజ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. వైజయంతీ మూవీస్ నిర్మాణంలో దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ఈ సినిమా టాలీవుడ్ నుంచి వస్తున్న మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ గా పాన్ వరల్డ్ క్రేజ్ తెచ్చుకుంటోంది.