Prabhas : 2024లో గూగుల్ సెర్చింజన్ లో డార్లింగ్ ప్రభాస్ హవా

  • గూగుల్ సెర్చింజన్ లో ప్రభాస్ మేనియా
  • కల్కితో బాక్సాఫీసు వద్ద సత్తా చాటిన డార్లింగ్
  • ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో ప్రభాస్ బిజీ

Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే తెలుగులోనే కాకుండా యావత్ దేశవ్యాప్తంగా ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఆయన ఓ సినిమా చేశాడంటే, అది ఖచ్చితంగా పాన్ ఇండియన్ మూవీగా రికార్డులను క్రియేట్ చేయడం ఖాయంగా అభిమానులు ఫిక్స్ అయిపోయారు. ఇక ఇటీవల ప్రభాస్ వరుస సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు.

Read Also:Collectors Conference: నేడు, రేపు కలెక్టర్ల సదస్సు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ

ఒక హీరోగానే కాకుండా ఆయన కష్టాల్లో ఉన్నవారికి తన వంతు సాయం అందించడానికి ఎప్పుడూ ముందుంటారు డార్లింగ్. ఆ మధ్య ఏపీలో వరదలు వస్తే విపత్తు నుంచి ఉపశమనం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు తీసుకొనే చర్యలకు సహాయపడాలని తన వంతుగా ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సహాయనిధికి ఒక్కో కోటి చొప్పున విరాళం ప్రకటించాడు.

Read Also:Mohan Babu: గన్ల సీజ్.. పోలీసుల కీలక ఆదేశాలు

ఆయన గతేడాది నటించిన మూవీ ‘కల్కి 2898 ఎడి’ బ్లాక్‌బస్టర్ సక్సె్స్ అందుకుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా భారీ వసూళ్లను కురిపించింది. ఇక 2024లో ప్రముఖ ఆన్‌లైన్ సెర్చ్ ఇంజిన్ ‘గూగుల్ సెర్స్’లో రెబల్ స్టార్ మేనియా కొనసాగింది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేశారు. 2024లో ప్రభాస్‌కి సంబంధించిన సినిమాల్లో ఎక్కువ మంది సెర్చ్ చేసింది సలార్, కల్కి చిత్రాలను అని గూగుల్ తెలిపింది. ఈ విషయం తెలియడంతో రెబల్ స్టార్ మేనియాకు గూగుల్ దద్దరిల్లిందని కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ది రాజా సాబ్, ఫౌజీ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *