Prabhas: ఫ్యాన్స్ కు ప్రభాస్ సారీ.. వీడియో రిలీజ్

ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన కల్కి 2898 సినిమా ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత నెల 27వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి ఆట నుంచే మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పటాని, రాజేంద్రప్రసాద్, అన్నా బెన్, శోభన వంటి వాళ్ళు కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడీ సినిమా జపాన్​లో 2025 జనవరి 3న రిలీజ్ కానుంది.

Rahul Gandhi: అంబేద్కర్‌ని అవమానిస్తే దేశం సహించదు..

ఈ సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో విడుదల చేశారు ప్రభాస్. తాను అక్కడికి రాలేకపోతున్నానంటూ ఫ్యాన్స్‌కు ప్రభాస్‌ క్షమాపణలు చెప్పారు. కొత్త సినిమా షూటింగ్‌లో కాలికి స్వల్ప గాయమవ్వడం వల్ల ప్రస్తుతానికి రాలేకపోతున్నానని వెల్లడించిన ఆయన త్వరలోనే కలుస్తానని ఫ్యాన్స్​కు చెప్పారు. తాను ప్రస్తుతం బాగానే ఉన్నానని వెల్లడించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే చివరిలో ప్రభాస్​ ‘కల్కి’ని ఎంజాయ్‌ చేయండంటూ జపనీస్‌లో మాట్లాడటం గమనార్హం.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *