పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23న వస్తుండటంతో యావత్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సెలబ్రేషన్స్‌ను గ్రాండ్‌గా నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇక అభిమానులకు ట్రీట్ ఇచ్చేందుకు ప్రభాస్ కూడా రెడీ అయ్యాడు. ఇందులో భాగంగానే ఆయన నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది రాజా సాబ్’ నుండి ఓ స్టైలిష్ అప్డేట్‌ను మేకర్స్ తాజాగా రివీల్ చేశారు.
‘ది రాజా సాబ్’ సినిమా నుండి ఓ సరికొత్త స్టైలిష్ పోస్టర్‌ను వారు రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ డార్లింగ్ లుక్‌లో కనిపించడంతో పాటు ఆయన తనదైన స్వాగ్‌తో ఇచ్చిన పోజ్ హైలైట్‌గా నిలిచింది. క్యాజువల్ వేర్స్‌తో వింటేజ్ ప్రభాస్ కూల్ లుక్స్‌తో అదరగొట్టాడని అభిమానులు సంబరపడుతున్నారు. ఇక ఆయనను ఈ తరహా పోస్టర్‌లో చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ది రాజా సాబ్ మూవీలో డార్లింగ్ లుక్స్‌తో ప్రభాస్ అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడని మరోసారి ఈ పోస్టర్ ద్వారా రివీల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో అందాల భామలు మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు మారుతి డైరెక్ట్ చేస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ.విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. అక్టోబర్ 23న ఈ చిత్రానికి సంబంధించి మరో ట్రీట్ ఉండనుందని మేకర్స్ వెల్లడించారు.
The post ‘ది రాజా సాబ్’ స్టైలిష్ అప్డేట్.. స్వాగ్‌తో ల్యాండ్ అయిన ప్రభాస్! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.