Prabhas Special Role in Kannappa
Prabhas Special Role in Kannappa

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కన్నప్ప’ సినిమాలో ప్రత్యేక పాత్రలో నటించనున్నారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మంచు విష్ణు, ప్రభాస్‌ గురించి ఆసక్తికరమైన విషయాన్ని షేర్ చేశారు.

విష్ణు మాటల ప్రకారం, తానే స్వయంగా ప్రభాస్‌కు కాల్ చేసి ‘కన్నప్ప’లో నటించమని అడిగారట. అయితే, ప్రభాస్ ఏమాత్రం ఆలస్యం లేకుండా వెంటనే అంగీకరించారని చెప్పారు. కానీ అసలు ట్విస్ట్ ఏమిటంటే, అంతకు ముందే మోహన్ బాబు కూడా ప్రభాస్‌కు ఫోన్ చేసి అదే విషయం చెప్పారట! దీంతో రెబల్ స్టార్ కాస్త భయపడ్డారని, నవ్వుతూ చెప్పిన విష్ణు, తర్వాత ప్రభాస్ తానే తనకు కాల్ చేసి ఆ విషయాన్ని చెప్పాడని వెల్లడించారు.

ఈ ఫన్నీ రివిలేషన్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా “అట్లుంటది మోహన్ బాబుతోని” అంటూ నెటిజన్లు సెటైరికల్ కామెంట్స్ చేస్తున్నారు. ఇది కేవలం ప్రభాస్ ఫ్యాన్స్‌కే కాదు, సినీ ప్రేమికులకు కూడా ఒక ఫన్నీ మోమెంట్ అయ్యింది. ‘కన్నప్ప’ సినిమా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుండటంతో, ప్రభాస్ క్యామియో రోల్‌పై అభిమానుల్లో హైపే నెలకొంది!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *