మిర్చిలాంటి కుర్రాడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ప్రగ్యా జైస్వాల్ తొలి సినిమా నుంచే అభిమానులను ఆకట్టుకున్నా, ఆమె కెరీర్‌లో ఆశించిన స్థాయిలో అవకాశాలు మాత్రం రాలేదనే చెప్పాలి.

‘కంచె’తో మంచి గుర్తింపు పొందిన ఈ బ్యూటీ, బాలయ్యతో కలిసి చేసిన అఖండ సినిమా ద్వారా తన కెరీర్‌లో మొదటి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకుంది. కానీ ఈ విజయాల తర్వాత కూడా టాప్ ఆఫర్స్ రావడంలో వెనుకబడి పోయిందనే చెప్పాలి.

తాజాగా బాలయ్యతో కలిసి నటించిన డాకు మహారాజ్ సినిమా కూడా హిట్ అయినప్పటికీ, ప్రగ్యాకు లీడ్ రోల్స్ రావడంలో మాత్రం విరామం కొనసాగుతోంది. అయితే సినిమాల్లో తక్కువగా కనిపిస్తున్నా, సోషల్ మీడియాలో మాత్రం ఈ భామ హాట్ హాట్ ఫోటోలతో ఫుల్ ట్రెండ్ అవుతుంది.

ఇటీవల బ్లాక్ డ్రెస్‌లో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట మంటలు పుట్టిస్తున్నాయి. ఫాలోవర్స్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ ప్రగ్యా జైస్వాల్ గ్లామర్ షో కొనసాగుతూనే ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *