Pranitha Subhash’s Life After Marriage
Pranitha Subhash’s Life After Marriage

టాలీవుడ్ అప్సరస ప్రణీత సుభాష్ ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా? ఎనిమిది సినిమాల్లో నటించినా ఒక్క ‘అత్తారింటికి దారేది’ సినిమా మాత్రమే ఆమెకు సక్సెస్ అందించింది. క్యూట్ లుక్స్, అందమైన హావభావాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నా, ఆమె కెరీర్ అంతగా రాణించలేదు.

2010లో ‘ఏం పిల్లో ఏం పిల్లడో’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రణీత, బావ, రభస, డైనమైట్, హలో గురు ప్రేమకోసమే, బ్రహ్మోత్సవం వంటి చిత్రాల్లో నటించింది. కానీ హీరోయిన్‌గా ఎక్కువ గుర్తింపు రాలేదు. ‘అత్తారింటికి దారేది’ లో పవన్ కళ్యాణ్ సరసన నటించి మంచి హిట్ అందుకున్నా, ఆ తర్వాత పెద్ద అవకాశాలు రాలేదు.

కెరీర్ పీక్‌లో ఉన్నప్పుడు ప్రణీత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. ఇప్పుడు ఆమెకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, తన అందంతో యూత్‌ను కట్టిపడేస్తోంది. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్ గా ఉంటూ తన ఫొటోలు, ఫ్యామిలీ మోమెంట్స్ పంచుకుంటుంది.

ప్రస్తుతం నెటిజన్స్ గూగుల్‌లో ప్రణీత కోసం తెగ సెర్చ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా ఫిట్‌నెస్‌ను కాపాడుకుంటూ, గ్లామర్ ఫోటోషూట్స్‌తో అభిమానులను అలరిస్తోంది. ఇక ఆమె మళ్లీ సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇస్తుందా? లేదా? అనేది చూడాలి!

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *