Published on Nov 24, 2024 1:00 AM IST
దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. తారక్ కెరీర్లో 31వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాతో ఎన్టీఆర్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయడం ఖాయమని అభిమానులు అప్పుడే ధీమా వ్యక్తం చేస్తున్నారు.
అయితే, ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు ప్రశాంత్ నీల్ పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపెట్టనున్నాడు. ఇక ఈ పాత్రతో పాటు మరో టెర్రిఫిక్ పాత్రను కూడా ఆయన డిజైన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ పాత్రలో ఓ స్టార్ యాక్టర్‌ను దించాలని ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడట. దీని కోసం బాలీవుడ్ నటుడు, మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌ను ఆయన సంప్రదించాలని చూస్తున్నాడట.
ఒకవేళ ఇదే నిజమైతే ఎన్టీఆర్, అమీర్ ఖాన్ల స్క్రీన్ ప్రిజెన్స్ అభిమానులకు ఫీస్ట్ అనే చెప్పాలి. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే మేకర్స్ నుండి క్లారిటీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.