Preity Zinta: “సల్మాన్‌ ఖాన్‌తో డేటింగ్ చేశారా?”.. నటి రి యాక్షన్ ఇదే..

  • సల్మాన్ ఖాన్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రీతి జింటా
  • సోషల్ మీడియా వేదికగా పోస్ట్
  • పలు చిత్రాలు పంచుకున్న నటి
  • “సల్మాన్‌ ఖాన్‌తో డేటింగ్ చేశారా?” అని ఓ నెటిజన్ కామెంట్
  • సమాధానం చెప్పిన ప్రీతి

సల్మాన్ ఖాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రీతి జింటా శుక్రవారం సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్‌లో పోస్ట్ పంచుకుంది. సల్మన్ ఖాన్‌తో కలిసి ఉన్న చిత్రాలను పంచుకుంది. “హ్యాపీ బర్త్ డే సల్మాన్ ఖాన్” అని రాసుకొచ్చింది. ఈ చిత్రాలను చూసిన అభిమానులు చాలా రియాక్ట్ అయ్యారు. వారి వారి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేశారు. అయితే ఒక అభిమాని వ్యాఖ్య ప్రీతి దృష్టిని ఆకర్షించింది. ఆ అభిమాని “సల్మాన్‌తో ఎప్పుడైనా డేటింగ్ చేశారా?” అని నటిని ప్రశ్నిస్తూ.. కామెంట్ చేశాడు. దీనిపై నటి స్పందించింది.‘‘మేము ఇద్దరం అస్సలు డేట్‌ చేయలేదు. తను (సల్మాన్ ఖాన్) నాకు కుటుంబ సభ్యుడు లాంటి వాడు. నా భర్తకు కూడా అతను మంచి స్నేహితుడు. నా సమాధానంతో మీరు ఆశ్చర్య పోతే నన్ను క్షమించండి’’ అని రిప్లై ఇచ్చింది.

READ MORE: IndiGo: ఇండిగో విమానం 16 గంటలు ఆలస్యం..ఎయిర్‌పోర్టులో చిక్కుకున్న ప్రయాణికులు..

ఇదిలా ఉండగా.. ప్రీతి జింటా- సల్మాన్ చాలా చిత్రాలలో కలిసి పనిచేశారు. వారిద్దరూ హర్ దిల్ జో ప్యార్ కరేగా, చోరీ-చోరీ, చుప్కే-చుప్కే, దిల్ నే జిసే అప్నా కహా, జాన్ ఇ మాన్, హీరోస్ వంటి సినిమాలలో నటించారు. కాగా.. ప్రీతి చివరిసారిగా 2018లో విడుదలైన భయ్యాజీ సూపర్‌హిట్ చిత్రంలో కనిపించింది. ఇందులో ఆమె సన్నీ డియోల్, అర్షద్ వార్సీ, అమీషా పటేల్‌లతో కలిసి కనిపించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అని తేలింది. ఆ తర్వాత ప్రీతి ఒక్క సినిమా కూడా చేయలేదు. అయితే ఇప్పుడు ప్రీతి మళ్లీ పునరాగమనానికి సిద్ధమైంది. ఆమె లాహోర్ 1947 చిత్రంలో సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో కనిపించబోతోంది. రాజ్‌కుమార్ హిరానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమీర్‌ఖాన్ ప్రొడక్షన్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

READ MORE: Grimes: ‘‘నా సవతి తండ్రి ఓ భారతీయుడు’’.. ఎలాన్ మస్క్ మాజీ ప్రియురాలు..

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *