
నటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం మహేష్ బాబు మరియు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న #SSMB29 సినిమాలో ప్రతినాయక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ కోసం ఆమె గత కొంతకాలంగా ఇండియాలో ఉంటున్నారు. ఈ సమయంలోనే ముంబైలోని తన ఖరీదైన ఫ్లాట్‌లను కొన్నింటిని ఆమె విక్రయించినట్లు తెలుస్తోంది.
అంధేరిలోని ఒబెరాయ్ స్కై గార్డెన్స్‌లో ఉన్న ఆమె ఫ్లాట్‌లకు మంచి డిమాండ్ ఉంది. ఇవి అత్యంత ఖరీదైనవి కూడా. ప్రియాంకకు అక్కడ నాలుగు ఫ్లాట్‌లు ఉండగా, వాటిని రూ. 16.17 కోట్లకు విక్రయించారు. 18వ అంతస్తులోని మూడు ఫ్లాట్‌లను రూ. 3.45 కోట్లు, రూ. 2.85 కోట్లు, రూ. 3.52 కోట్లకు అమ్మేశారు. 19వ అంతస్తులో ఉన్న ఒక జంట ఫ్లాట్‌ను రూ. 6.35 కోట్లకు విక్రయించారు. మార్చి 3వ తేదీన ఈ లావాదేవీలు పూర్తయ్యాయి.
ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ ఇండియా కథనం ప్రకారం, ప్రియాంక 2021లో వెర్సోవాలోని రెండు ఆస్తులను, 2023లో లోఖండ్‌వాలాలోని రెండు పెంట్ హౌస్‌లను కూడా విక్రయించారు. ప్రస్తుతం ఆమెకు గోవా, న్యూయార్క్, లాస్ ఏంజిల్స్‌లో సొంత భవనాలు ఉన్నాయి. హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీగా ఉన్న ప్రియాంక, భర్త నిక్ జోనస్, కుమార్తె మేరీ చోప్రా జోన్స్‌తో కలిసి లాస్ ఏంజిల్స్‌లో ఉంటున్నారు.
సినిమాల విషయానికొస్తే, ఆమె హాలీవుడ్‌లో ‘హెడ్స్ ఆఫ్ స్టేట్’, ‘ది బ్లఫ్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ‘సిటాడెల్’ అమెరికన్ సిరీస్‌లో కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న #SSMB29 సినిమాలో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒడిశాలో జరుగుతోంది. ఈ సినిమాలో మహేష్ బాబు పేరు ‘రుద్ర’ అని టాక్.