
టాలీవుడ్ లో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన నటీనటులు మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. రాజ్ తరుణ్, సుహాస్, చాందిని చౌదరి, కిరణ్ అబ్బవరం, సందీప్ రాజ్ లాంటి వారు షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇండస్ట్రీలోకి వచ్చి సక్సెస్ అయ్యారు. వారిలో ప్రియాంక జవాల్కర్ ఒకరు.
ప్రియాంక విజయ్ దేవరకొండ సరసన టాక్సీవాలా చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా మంచి హిట్ అందుకోవడంతో, ఆమెకు టాలీవుడ్ లో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత గమనం, ఎస్ఆర్ కల్యాణమండపం, తిమ్మరుసు చిత్రాల్లో నటించింది. వీటిలో టాక్సీవాలా, ఎస్ఆర్ కల్యాణమండపం మంచి విజయాన్ని అందుకున్నాయి. కానీ ప్రస్తుతం ప్రియాంక కొత్త ప్రాజెక్ట్ లేక ఖాళీగా ఉంది.
సినిమాల్లోకి రాక ముందు, ప్రియాంక షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు ఆమె స్టైల్, లుక్ పూర్తిగా మారిపోయాయి. సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కుర్రాళ్లను ఆమె అందం, గ్లామర్ ఫోటోలు కట్టిపడేస్తున్నాయి.
తాజాగా ప్రియాంక జవాల్కర్ షేర్ చేసిన ఫోటోలు అభిమానులను ఆకర్షిస్తున్నాయి. గ్లామరస్ స్టిల్స్ చూసి నెటిజన్లు లైకులు, కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ప్రియాంక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ, ఫ్యాషన్ ఫోటోషూట్ లతో అందరినీ ఆకర్షిస్తోంది. టాలీవుడ్ లో ఆమెకు మళ్లీ మంచి అవకాశాలు వస్తాయా లేదా చూడాలి.