Published on Jan 1, 2025 1:13 AM IST
టాలీవుడ్‌లో తెరకెక్కిన ‘టిల్లు’, ‘టిల్లు స్క్వేర్’ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సక్సెస్ అందుకున్నాయో మనం చూశాం. ఈ సినిమాల్లో హీరో సిద్ధు జొన్నలగడ్డ తనదైన పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు. ఇక తొలి చిత్రాన్ని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా, రెండో చిత్రాన్ని రామ్ మల్లిక్ డైరెక్ట్ చేశారు. అయితే, ఇప్పుడు టిల్లు మూడో సీక్వెల్ మూవీపై కూడా చర్చ సాగుతోంది.
ఈ చిత్రాల నిర్మాత నాగవంశీ తాజాగా ‘టిల్లు-3’పై కొన్ని కామెంట్స్ చేశారు. సిద్ధుతో తమ ర్యాపో బాగా సెట్ అయ్యిందని.. దీంతో ‘టిల్లు-3’ మూవీ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొందని.. అయితే, ఈ సినిమాపై వర్క్ స్టార్ట్ అయ్యిందని.. ప్రస్తుతం కథకు సంబంధించిన స్టోరీ వర్క్ నడుస్తుందని నాగవంశీ తెలిపారు. ఆయన చేసిన కామెంట్స్‌తో ఇప్పుడు ‘టిల్లు-3’పై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌కు చేరుకుంటున్నాయి. మరి ఈ క్రేజీ మూవీకి సంబంధించిన అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో చూడాలి.