ఆ అనుభూతి ‘ఘటికాచలం’ ఇస్తుంది – నిర్మాత ఎస్.కే.ఎన్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Oct 14, 2024 7:20 AM IST

నిఖిల్ దేవాదుల హీరోగా నటిస్తున్న సినిమా “ఘటికాచలం”. ఈ చిత్రానికి కథను అందిస్తూ ఒయాసిస్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు ప్రొడ్యూసర్ ఎం.సి.రాజు. “ఘటికాచలం” చిత్రాన్ని ఇంటెన్స్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిస్తున్నారు దర్శకుడు అమర్ కామెపల్లి. త్వరలోనే “ఘటికాచలం” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. “ఘటికాచలం” సినిమాను వరల్డ్ వైడ్ రిలీజ్ చేస్తున్నారు సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ ఎస్ కేెఎన్, స్టార్ డైరెక్టర్ మారుతి. ఈరోజు “ఘటికాచలం” సినిమా టీజర్ లాంఛ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు.

డైరెక్టర్ అమర్ కామెపల్లి మాట్లాడుతూ – ఈ సినిమా కాన్సెప్ట్ ను యూఎస్ లో ఉండే నా ఫ్రెండ్ రాజు చెప్పాడు. వాళ్లకు తెలిసిన వారి ఇంట్లో జరిగే కొన్ని ఘటనలు చెప్పాడు. నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. 19 ఏళ్ల మెడికల్ స్టూడెంట్ లైఫ్ లో జరిగిన కథ ఇది. రాజు మనమే ఈ మూవీ చేద్దామని చెప్పారు. అలా ఘటికాచలం సినిమా మొదలైంది. నా ఫ్రెండ్ రాజుకు థ్యాంక్స్ చెబుతున్నా. మంచి టెక్నీషియన్స్ మనకు కావాల్సిన బడ్జెట్ లో ఎవరు దొరుకుతారని చూశాను. మంచి టీమ్ దొరికారు. ఇలాంటి సినిమా చేశాక ఏం చేయాలో అర్థం కాలేదు. మారుతి గారికి ట్రైలర్ చూపించాను. ఆయనకు నచ్చి మూవీ చూపించు అన్నారు. చూపించాను. మారుతిగారికిమూవీ నచ్చింది. చిన్న చిన్న మార్పుులు చెప్పారు. ఎస్కేఎన్ గారు చూశారు. ఆయనకూ నచ్చింది. క్రూషియల్ చేంజెస్ మారుతి గారు ఎస్కేఎన్ గారు చెప్పారు. వారు చెప్పిన మార్పులు చేశాను. మూవీని టేకప్ చేసి రిలీజ్ చేస్తున్నారు. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఎస్కేఎన్, మారుతి గారికి థ్యాంక్స్ చెబుతున్నా. వారికి జీవితాంతం రుణపడి ఉంటాను. మా మూవీ టీజర్, ట్రైలర్ నచ్చితేనే మూవీ చూడండి. అన్నారు.

నిర్మాత ఎస్ కే ఎన్ మాట్లాడుతూ – మారుతి గారు రాజా సాబ్ సినిమా షూటింంగ్ లో బిజీగా ఉండి రాలేకపోయారు. చిత్ర పరిశ్రమలో చిన్న సినిమాలే కీలకం. థియేటర్స్ ఫీడింగ్ అయ్యేదే చిన్న చిత్రాలతో. చిన్న చిత్రాలు ప్రమోషన్ లేక, ప్రాపర్ రిలీజ్ లేక ప్రేక్షకులకు రీచ్ కావడం లేదు. అలాంటి చిన్న చిత్రాలకు సపోర్ట్ చేయాలని మారుతి గారు, నేను, ధీరజ్ ఇలా మేమంతా అనుకున్నాం. ఈ క్రమంలో ఘటికాచలం సినిమా చూశాం. సినిమా చూస్తున్నంతసేపూ ఎంత బడ్జెట్ పెట్టి చేశారు అనేదాని కంటే టెక్నికల్ గా ఉన్న క్వాలిటీ బాగా ఆకట్టుకుంది. డైరెక్టర్ అమర్ గారు ఒక పది సినిమాలు చేసినంత ఎక్సీపిరియన్స్ ఉన్న డైరెక్టర్ లా మూవీ రూపొందించారు. నాకు హారర్ మూవీస్ చాలా ఇష్టం. భయపడినా ఇష్టపడుతూ హరర్ మూవీస్ చూస్తుంటా. మ్యూజిక్ డైరెక్టర్ సూపర్బ్ గా మ్యూజిక్ ఇచ్చారు. హారర్ మూవీ ఇవ్వాల్సిన ప్రతి అనుభూతిని ఘటికాచలం సినిమా ఇస్తుంది. నిఖిల్ నటన మిమ్మల్ని బాగా ఆకట్టుకుంటుంది. అతనికి నేనిచ్చే సలహా ఏంటంటే ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేయమని, హీరోగా వస్తే హీరోగా, క్యారెక్టర్ వస్తే క్యారెక్టర్ లో నటించు. ఘటికాచలం సినిమా రిలీజ్ డేట్ త్వరలోనే అనౌన్స్ చేస్తాం. మా బేబీ సినిమా హందీ వెర్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఇతర ప్రాజెక్ట్స్ పనులు కూడా స్పీడ్ గా జరుగుతున్నాయి’ అని ఎస్.కే.ఎన్ అన్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *