నయనతారను పట్టించుకోని జనం..! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Nov 22, 2024 7:03 PM IST

తమిళ స్టార్ హీరోయిన్ నయనతారకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లోనూ నయన్‌కి అభిమానులు ఉన్నారు. ఇక ఉత్తరాదిన కూడా ‘జవాన్’ సినిమాతో నయన తనదైన మార్క్ వేసుకుంది. ఏకంగా బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్‌తో సినిమా చేసిన ఈ బ్యూటీ ఇటీవల వరుసగా వార్తల్లో నిలుస్తోంది.

అయితే, తాజాగా ఆమెను సామాన్య జనం ఏమాత్రం పట్టించుకోకపోవడం నెట్టింట వైరల్ అవుతోంది. నయన్ తన భర్త విఘ్నేష్ శివన్‌తో కలిసి భోజనం చేసేందుకు ఓ హోటల్‌కి వెళ్లగా.. అక్కడ దాదాపు 30 నిమిషాల పాటు కామన్ పబ్లిక్‌తో కలిసి క్యూలో నిల్చుందని.. ఆ తరువాతే వారికి ఓ టేబుల్ దొరికిందని విఘ్నేష్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. తన పుట్టినరోజున భర్తతో కలిసి నయన ఓ రెస్టారెంట్‌లో డిన్నర్ చేసేందుకు వెళ్లింది.

అక్కడ జనం వారిని ఏమాత్రం పట్టించుకోకపోవడం నిజంగా ఫ్యాన్స్‌ని షాకింగ్‌కి గురిచేసింది. అయితే, ఢిల్లీలో ఇలాంటి సీన్స్ కామన్ అని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక తన భార్యతో ఇలా సింపుల్ డిన్నర్ చేసి చాలా రోజులు అయ్యిందని విఘ్నేష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *