- ‘పుష్ప-2’ ఖాతాలో పేరిట మరో రికార్డు
- హిందీ బాక్సాఫీస్ వద్ద రూ.806 కోట్ల వసూళ్లు
- హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా రికార్డు
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ ల ‘పుష్ప-2’ రికార్డు స్థాయి వసూళ్లుతో దూసుకెళుతోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ వసూలు చేస్తోంది. వెయ్యి కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని టార్గెట్ తో బరిలో దిగిన పుష్ప రాజ్ ఆ రికార్డును కేవలం తొమ్మిది రోజుల్లోనే సాధించి రెండువేల కోట్ల వైపు పరుగులు పెడుతోంది. కాగా..తాజాగా ఈ సినిమా ఖాతాలో మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. రూ.806 కోట్లు (నెట్) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్ వద్ద నంబర్ వన్ చిత్రంగా ఇది నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ తాజాగా స్పెషల్ ప్రోమో విడుదల చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: India weapon: ఈ భారత ఆయుధం అంటే చైనా, పాక్‌కి భయం.. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్..