Published on Dec 6, 2024 12:01 AM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక పూనకాలు తెప్పించే సీన్స్‌కు ప్రేక్షకుల నుండి సాలిడ్ రెస్పాన్స్ లభిస్తోంది.
ఈ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూసి మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా, తాజాగా ‘పుష్ప-2’ మరో సాలిడ్ రికార్డును క్రియేట్ చేసింది. ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ఒక్క గంటలో ఏకంగా లక్ష టికెట్లు అమ్ముడైనట్లుగా తెలుస్తోంది. ఇది ఆల్‌టైమ్ రికార్డు అని బుక్ మై షో పేర్కొంది. గతంలో కల్కి 2898 ఎడి మూవీ ఒక్క గంటలో 97700 టికెట్లతో టాప్ ప్లేస్‌లో నిలిచింది. ఇప్పుడు పుష్ప-2 ఆ రికార్డును క్రాస్ చేసింది.
ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వసూళ్లతో వండర్స్ చేయడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.