Published on Dec 7, 2024 1:58 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “పుష్ప 2”. మరి ఎన్నో అంచనాలు నడుమ విడుదలకి వచ్చిన ఈ చిత్రం ఇండియా వైడ్ గా సెన్సేషన్ ని సెట్ చేస్తుంది అని నమ్మిన అందరి భావనని నిజం చేస్తూ మొదటి రోజు రికార్డు వసూళ్లు సొంతం చేసుకోగా మెయిన్ గా హిందీలో ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేస్తుందా అనేది అందరిలో బాగా ఉత్కంఠ రేపింది.
అయితే ఊహించని విధంగా హిందీ మార్కెట్ లో కూడా అక్కడి స్టార్స్ రికార్డులు సైతం అల్లు అర్జున్ బద్దలు కొట్టి ఒక కొత్త ఇతిహాసాన్ని రాసాడు. ఇలా మొదటి రోజు ఏకంగా 70 కోట్లకి పైగా హిందీలో అందుకోగా ఇపుడు రెండో రోజు కూడా సెన్సేషనల్ నంబర్స్ ని పుష్ప 2 అందుకున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నారు.
ఇలా డే 2 కి పుష్ప 2 ఏకంగా 59 కోట్లు నెట్ వసూళ్లు అందుకొని కేవలం రెండు రోజుల్లోనే “పుష్ప 1” లైఫ్ టైం వసూళ్ళని క్రాస్ చేసేసి 131 కోట్ల మార్క్ కి చేరుకుంది. ఇక నెక్స్ట్ వీకెండ్ వసూళ్లు కూడా ఊహించని రేంజ్ లో ఉంటాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.