నార్త్ లో “పుష్ప 2” హిస్టరీ.. టాప్ 5 వసూళ్ల సినిమాలు ఇవే.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 10, 2024 1:00 AM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఇక ఈ సినిమా సరికొత్త రికార్డులతో బాక్సాఫీస్ దగ్గర దుమ్ములేపుతుంది. ఇప్పటికే కొన్ని రికార్డులు క్రియేట్ చేసిన ‘పుష్ప-2’ ఇప్పుడు మరో అరుదైన రికార్డును కూడా దక్కించుకుంది.

ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో 10 మిలియన్ టికెట్లు అమ్ముడైన ఫాస్టెస్ట్ మూవీగా పుష్ప-2 నిలిచింది. ఈ రేంజ్‌లో టికెట్స్ ఇంత త్వరగా సేల్ కావడం నిజంగా విశేషమని చెప్పాలి. ఇక ఇప్పటికే పుష్ప-2 కలెక్షన్స్ రూ.800 కోట్ల మార్క్‌ను క్రాస్ చేయడంతో, ఈ చిత్రం మున్ముందు ఇంకా ఎలాంటి వసూళ్లు రాబడుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

‘పుష్ప-2’ చిత్రంలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా.. ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *