Published on Dec 19, 2024 7:08 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డులు క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు సుకుమార్ తెరకెక్కించగా పూర్తి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పుష్ప-2 సెన్సేషనల్ రన్ కొనసాగిస్తుంది. ఈ సినిమా డిసెంబర్ 5న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ అయ్యింది.
ఇక రిలీజ్ అయిన 14 రోజుల్లోనే ‘పుష్ప 2’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా రూ.1508 కోట్ల కలెక్షన్లు సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. రూ.1500 కోట్ల మార్క్‌ను అందుకున్న ఫాస్టెస్ట్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ చరిత్ర సృష్టించింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.
రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో ఫహాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.