Published on Nov 30, 2024 5:30 PM IST
ఇపుడు పాన్ ఇండియా సినిమా దగ్గర మోస్ట్ హైప్ లో ఉన్న బిగ్గెస్ర్ సినిమా “పుష్ప 2 ది రూల్”. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తో చేస్తున్న ఈ అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ పట్ల వేరే లెవెల్ హైప్ అయితే నెలకొంది. దీనితో ఈ చిత్రం రికార్డు థియేటర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుండగా మన తెలుగు రాష్ట్రాల్లో టికెట్ ధరలు అయితే ఒకింత హాట్ టాపిక్ గా మారాయి.
మరి నైజాం మార్కెట్ లో లేటెస్ట్ గా బుకింగ్స్ కూడా ఓపెన్ కాగా పుష్ప 2 కి గరిష్టంగా 1000 రూపాయలకి పైగానే రేట్లు ఉంటాయి అని టాక్ వైరల్ అవుతున్న తరుణం లోనే అఫీషియల్ ధరలు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవోతో వచ్చేసాయి. మరి డిసెంబర్ 5 న సినిమా రిలీజ్ అయితే డిసెంబర్ 4 రాత్రి నుంచే పుష్ప 2 పైడ్ ప్రీమియర్స్ తెలంగాణాలో ఈ జీవో ప్రకారం ఫిక్స్ అయ్యాయి. మరి ఈ షోలు పలు సింగిల్ స్క్రీన్స్ అలాగే మల్టీప్లెక్స్ స్క్రీన్స్ లలో రాత్రి 9 గంటల 30 నిమిషాలకి స్టార్ట్ కానుండగా వీటి ధర అప్పటికి ఉన్న నార్మల్ ధర మీద ఏకంగా 800 కి హైక్ ఇచ్చారు.
సింగిల్ స్క్రీన్స్ ధరలు:
ఇక తదుపరి రిలీజ్ డే 5 నుంచి 8 వరకు 150 రూపాయలు, అలాగే 9 నుంచి 16వ తేదీ వరకు 105 రూపాయలు అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు 20 రూపాయలు అదనంగా సింగిల్ స్క్రీన్స్ లో ధరలు ఛార్జ్ చేయబడనున్నాయి.
మల్టీప్లెక్స్ ధరలు:
ఇక మల్టీప్లెక్స్ ల విషయానికి వస్తే.. రిలీజ్ రోజు 5 నుంచి 8 వరకు 200 రూపాయలు, అలాగే 9 నుంచి 16వ తేదీ వరకు 150 రూపాయలు, అలాగే డిసెంబర్ 17 నుంచి 23 వరకు 50 రూపాయలు అదనంగా మల్టీప్లెక్స్ స్క్రీన్ లలో ఛార్జ్ చేసుకునే విధంగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
దీనితో పుష్ప 2 కి తెలంగాణాలో అత్యధికంగా ఒక టికెట్ ధర 1239(ప్రీమియర్) అయితే అత్యల్పంగా 200 రూపాయలుగా ఉండనున్నాయి. మొత్తానికి అయితే పుష్ప 2 కి నైజాంలో బిగ్గెస్ట్ డే 1 పడేలా ఉందని చెప్పాలి.