నైజాంలో “పుష్ప 2” పైడ్ ప్రీమియర్స్.. భారీ ధరతో షోస్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 30, 2024 5:57 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేస్తూ రికార్డులను తిరగరాస్తుంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం వరల్డ్‌వైడ్‌గా స్టన్నింగ్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకెళ్తోంది. అల్లు అర్జున్ నట విశ్వరూపానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక ఈ సినిమాకు సౌత్‌తో పాటు నార్త్ ఆడియెన్స్ కూడా పట్టం కడుతున్నారు.

ఈ క్రమంలోనే ‘పుష్ప-2’ ఓ అరుదైన ఫీట్ సాధించింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య 70 ఎంఎం థియేటర్‌లో గత 23 ఏళ్లుగా ఉన్న రికార్డును ‘పుష్ప-2’ బద్దలుకొట్టింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీ ‘ఖుషి’ పేరిట ఉన్న రూ.1.53 కోట్ల రికార్డులను ‘పుష్ప-2’ దాటేసింది. కేవలం నాలుగు వారాల్లోనే పుష్ప-2 ఇక్కడ రూ.1.59 కోట్లు వసూళ్లు చేసింది.

అయితే, ఖుషి రిలీజ్ టైమ్‌లో టికెట్ రేట్లు, ఇప్పుడు పుష్ప-2 టైమ్ టికెట్ రేట్లు చాలా వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఇక పుష్ప-2 మున్ముందు ఇంకా ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *