Pushpa 2 Bugga Reddy: సైలెంటుగా నాలుగు పాన్ ఇండియా హిట్లు కొట్టిన పుష్ప 2 విలన్

అల్లు అర్జున్ ‘పుష్ప 2’ థియేటర్లలో దూసుకుపోతోంది. పుష్ప రాజ్‌తో పాటు రష్మిక, ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్‌ పాత్రలపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్‌ని ఇబ్బంది పెట్టే బుగ్గారెడ్డి పాత్రలో రెచ్చిపోయి నటించాడు ఓ నటుడు. అయితే శిథిలావస్థలో ఉన్న కాళీ విగ్రహం ముందు చిత్రీకరించిన ఈ యాక్షన్ సీన్ బుగ్గారెడ్డి కారణంగా మరింత శక్తివంతంగా మారింది. అయితే ఈ ఈ బుగ్గ ఎవరు? ఇంతకీ ఈ పాత్రలో ఎవరు నటించారో తెలుసా? . ‘పుష్ప 2’ ట్రైలర్‌లో సగం బట్టతల విలన్‌ను చూపించినప్పుడు, దాని గురించి తెలుసుకోవాలనే ఆసక్తి అందరిలో పెరిగింది. ఇక ఇప్పుడు ఈ సినిమా విడుదలయ్యాక జనాల్లో ‘బుగ్గారెడ్డి’ పేరు బాగా నానుతోంది. బుగ్గారెడ్డి పాత్రలో నటించిన ఆ నటుడి పేరు తారక పొన్నప్ప.

RGV: అవాస్తవాలను ప్రచారం చేస్తే ఊరుకోను -ఆర్జీవీ

ఇతను ప్రముఖ కన్నడ స్టార్. దక్షిణాది అగ్ర విలన్‌లలో ఒకడిగా మారుతున్నాడు. ఇటీవల విడుదలైన జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర: పార్ట్ 1’లో కూడా తారక్ పొన్నప్ప కనిపించారు. ఇందులో సైఫ్ అలీఖాన్ కొడుకు పాసుర పాత్రలో కనిపించాడు. రాకీ భాయ్‌తో తారక్ పొన్నప్పకు కూడా సంబంధం ఉందని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. వాస్తవానికి తారక్ పొన్నప్ప KGF: చాప్టర్ 1, KGF 2లో కూడా నటించాడు. ఈ ఫ్రాంచైజీలో దయా పాత్రలో తారక్ పొన్నప్ప నటించారు. ‘కేజీఎఫ్ 1’, ‘కేజీఎఫ్ 2’ చిత్రాలతో వెలుగులోకి వచ్చిన తారక్ ఆ తర్వాత తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టాడు. ప్రస్తుతం తారక్ పొన్నప్ప వయసు 33 ఏళ్లు. సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ చేసేవారు. ఇక మొత్తం నాలుగు పాన్ ఇండియా సినిమాలతో ఆయన పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *