పుష్ప-2 సినిమా కారణంగా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వైడ్ సినిమా హాళ్లు అన్నీ హౌస్ ఫుల్ రన్ అవుతున్నాయి.ఈ సినిమా వసూళ్లు చూసి దొంగలు ఓ ప్రాంతంలో కుట్ర పన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలోని ముక్తా మల్టీప్లెక్స్ సినిమా హాల్‌లో దుండగులు రూ.1.34 లక్షలు దోచుకెళ్లారు. అసలు విషయం ఏమిటంటే ఈ థియేటర్లో పుష్ప 2 ప్రదర్శితమవుతోంది. మంగళవారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో ఇద్దరు అగంతకులు సినిమా హాల్లోకి ప్రవేశించారు. ముందుగా సెక్యూరిటీ గార్డును కొట్టి ఓ గదిలో బంధించారు. అనంతరం లాకర్‌లోని రూ.1.34 లక్షలు దోచుకుని పరారయ్యారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. అక్కడ అమర్చిన సీసీ కెమెరాల డీవీఆర్‌లను కూడా దుండగులు ఎత్తుకెళ్లినట్లు సినిమా హాల్ మేనేజర్ దీపక్ కుమార్ తెలిపారు.
Manchu Lakshmi: కుటుంబంలో పెను వివాదం.. మంచు లక్ష్మి ‘శాంతి’ మంత్రం
అయితే ఘటనా స్థలంలో పగిలిన డీవీఆర్ లభ్యం కావడంతో దాన్ని సరి చేసి ఫుటేజీని వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఫుటేజీలో ఇద్దరు యువకులు ద్విచక్రవాహనంపై వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వారిని గుర్తించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం పుష్ప 2 చిత్రం ముక్తా A2 సినిమాలో నడుస్తోంది, థియేటర్లో అన్ని షోలు హౌస్‌ఫుల్‌గా నడుస్తున్నాయి. ఆ కారణంగా మంచి వసూళ్లు వచ్చాయి. దుండగులు ముందుగానే రెక్కీ చేసి మొత్తం ఘటనకు పాల్పడ్డారని సినిమా హాల్ మేనేజర్ పోలీసులకు తెలిపారు. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో కలకలం రేగింది. ఈ విషయంపై ఏఎస్పీ భిలాయ్ సుఖ్ నందన్ రాథోడ్ మాట్లాడుతూ.. ఫుటేజీలు, ఇతర ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించి త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. పోలీసులు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఘటనకు పాల్పడిన అనంతరం దుండగులు ద్విచక్రవాహనంపై పారిపోయారు. ఈ ఘటనతో భద్రతా వ్యవస్థపై ప్రశ్నలు తలెత్తుతున్నాయని స్థానికులు అంటున్నారు. పోలీసులు పలు బృందాలుగా ఏర్పడి దుండగుల కోసం గాలిస్తున్నారు.