- తాజాగా అల్లు అర్జున్ అరెస్ట్
- పుష్ప 2 అరెస్ట్ రోజు ఎంత కలెక్ట్ చేసిందంటే
సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిస్థితులలో అరెస్టయి ఒకరోజు రాత్రి జైలులో గడిపి బయటకు వచ్చారు అల్లు అర్జున్. ఇక అల్లు అర్జున్‌ను కలవడానికి సినీ ప్రముఖులందరూ ఆయన నివాసానికి క్యూ కట్టారు. ఒకపక్క అరెస్ట్ మరోపక్క పుష్ప2తో బ్లాక్ బస్టర్ కొట్టడంతో.. ప్రస్తుతం దేశమంతటా బన్నీ గురించే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పుష్ప2 మూవీ ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్లు వసూలు చేసినట్టు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. అలాగే.. ఫస్ట్ వీక్‌లో 1067 కోట్లు రాబట్టినట్టుగా మేకర్స్ వెల్లడించారు కూడా. అయితే.. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో.. పుష్ప 9వ రోజు కలెక్షన్స్ ఎలా ఉన్నాయి అనే ఆసక్తి అందరిలో ఏర్పడింది. అయితే ఆరోజున కలెక్షన్స్ కాస్త తగ్గినట్టుగా ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. 9వ రోజు ‘పుష్ప 2 ది రూల్’ సినిమాకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 36 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయనీ అంటున్నారు.
Also Read: Game Changer: గేమ్ ఛేంజర్ లేటు కావడానికి అసలు కారణం ఇదే!
వీటిలో అన్నిటి కంటే ఎక్కువగా హిందీలో 27 కోట్లు వస్తే తెలుగులో 7.5 కోట్లు, తమిళంలో 1.35 కోట్లు, కన్నడ, మలయాళ భాషల్లో 2 లక్షలు మాత్రమే రాబట్టినట్టుగా ఒక నేషనల్ కలెక్షన్స్ ట్రాకింగ్ వెబ్ సైట్ రిపోర్ట్ చేసింది.. ఇక ఇండియా మొత్తంగా చూస్తే.. 9 రోజుల్లో 762 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లుగా అంచనాలు ఉండగా ఒక్క హిందీ నుంచే 452 కోట్లు రాబట్టడం గమనార్హం. తెలుగులో 250 కోట్లు, తమిళ వెర్షన్ 42 కోట్లకు పైగా వసూలు చేసినట్టు అంచనా. ఇక కేరళ నుంచి 5.5 కోట్లు కలెక్ట్ కాగా ఓవరాల్ మలయాళం ద్వారా 12 కోట్ల కలెక్షన్స్ వసూలు అయ్యాయని అంటున్నారు. ఇక వరల్డ్ వైడ్ గ్రాస్ ప్రకారం చూస్తే.. 9 రోజుల్లో 1100 కోట్ల మార్క్ క్రాస్ చేసి, 1200 కోట్ల వైపు దూసుకుపోతోంది పుష్ప 2.
నోట్: ఈ కలెక్షన్స్ ను ఎన్ టీవీ ధ్రువీకరించడం లేదు.. వివిధ సోషల్ మీడియా మధ్యమాల ద్వారా ఈ ఇన్ఫో సేకరిచించాం.