Published on Dec 26, 2024 7:01 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ దూసుకెళ్తోంది. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాగా, తొలిరోజు నుంచే రికార్డులను ‘రప్పా రప్పా’ అంటూ క్రియేట్ చేస్తూ వెళ్తోంది. ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న తీరుతో మేకర్స్, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
పక్కా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ‘పుష్ప-2’ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియటర్లకు క్యూ కడుతున్నారు. ఈ సినిమా రిలీజ్ అయ్యి మూడు వారాలు పూర్తయినా, కలెక్షన్స్ ఏమాత్రం తగ్గడం లేదు. ఈ సినిమా 21 రోజులు పూర్తయ్యే సరికి వరల్డ్‌వైడ్‌గా ఏకంగా రూ.1705 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు.
2024లోనే ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ గ్రాసర్‌గా పుష్ప-2 నిలిచింది. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.