Published on Dec 5, 2024 9:01 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ‘పుష్ప-2’తో బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్నాడు. దర్శకుడు సుకుమార్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరుకి ప్రేక్షకులు థియేటర్లలో నీరాజనాలు పలుకుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తాండవం చేయడం ఖాయమని అభిమానులు ధీమాగా చెబుతున్నారు. అయితే, ఈ సినిమా ప్రీ-సేల్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డును క్రియేట్ చేయడం విశేషం.
ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘పుష్ప-2’ ఏకంగా 3 మిలియన్‌కి పైగా ప్రీసేల్స్ టికెట్లు అమ్ముడయ్యాయి. ఇది ఇండియన్ సినిమాలో ఆల్ టైమ్ రికార్డు అని బుక్ మై షో వెల్లడించింది. ‘పుష్ప-2’ దెబ్బకు రికార్డులు రప్పా రప్ప అంటూ బద్దలవుతున్నాయని సదరు సంస్థ పేర్కొనడం విశేషం.
ఈ సినిమాలో అందాల భామ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం మేజర్ అసెట్‌గా నిలిచింది.