రప్పా రప్పా.. పుష్పగాడి దెబ్బకు ఇండియన్ సినిమా రికార్డులు గల్లంతు! | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 6, 2024 7:17 PM IST

టాక్ ఆఫ్ ది నేషన్‌గా మారిన ‘పుష్ప-2’ దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమాతో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్ ప్రేక్షకులకు సాలిడ్ ట్రీట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాలోని కథ, బన్నీ నట విశ్వరూపం తో ప్రేక్షకులకు ఫుల్ మీల్స్ లభించాయి. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎవరూ ఊహించని రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా తొలి రోజు ఏకంగా రూ.294 కోట్ల వసూళ్లతో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమా కూడా ఈ స్థాయిలో ఓపెనింగ్ కలెక్షన్స్ రాబట్టలేదని మేకర్స్ తెలిపారు. దీంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇక ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే, రాబోయే రోజుల్లో ఈ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని సినీ సర్కిల్స్ చెబుతున్నాయి.

అటు హిందీ వర్షన్‌లోనూ ఈ సినిమా తొలిరోజు ఏకంగా రూ.72 కోట్ల వసూళ్లు సాధించి మరో రికార్డు క్రియేట్ చేసింది. ఇలా పుష్ప-2 రికార్డులకు ఎసరు పెడుతుండటంతో, ఈ మూవీ ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *