Pushpa -2 : రూ. 800 కోట్లతో పుష్పరాజ్ ప్రభంజనం

డిసెంబర్ 5న రిలీజ్ అయిన మోస్ట్ అవైటేడ్ మూవీ పుష్ప 2. మూడు వారాల్లోనే వరల్డ్ వైడ్‌గా రూ. 1700 కోట్లు రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అత్యంత వేగంగా రూ. 1000, 1500, 1700 కోట్ల గ్రాస్ రాబట్టిన సినిమాగా పుష్ప2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఖచ్చితంగా లాంగ్ రన్‌లో రూ. 1800 కోట్ల మార్క్ టచ్ చేసి బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేసేలా ఉంది పుష్ప2. అయితే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్‌లో ఒక్క బాలీవుడ్ నుంచే దాదాపుగా సగం వరకు రావడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పటి వరకు  బాలీవుడ్‌ బడా స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌కు సైతం ఈ రేంజ్ వసూళ్లు సాధ్యం కాలేదు.

Also Read : UnstoppableWithNBK : రామ్ చరణ్ తో కలిసి పవర్ఫుల్ డైలాగ్ చెప్పిన బాలయ్య

కానీ పుష్పరాజ్ మాత్రం 25 రోజుల్లోనే రూ. 770 కోట్లకు పైగా నెట్ వసూలు చేసింది. ఈ విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించారు మైత్రీ మూవీ మేకర్స్ వారు. ఇప్పటికీ నార్త్ బెల్ట్‌లో సాలిడ్ ఆక్యుపెన్సీతో దూసుకెళ్తోంది పుష్ప 2. అసలు పుష్పరాజ్ క్రేజ్ ఎలా ఉందంటే సినిమా తీసేస్తామంటే ఏకంగా థియేటర్ యాజమాన్యంతో గొడవ దిగుతున్నారు అక్కడి  ప్రేక్షకులు. ఈ నెల 25న ఓ థియేటర్​లో ఆన్‌లైన్‌లో ‘పుష్ప 2’కి టికెట్లు బుక్ చేసుకున్నారు ప్రేక్షకులు. కానీ తీరా థియేటర్‌కి వెళ్లాక  స్క్రీన్‌ పై ‘బేబీ జాన్‌’ సినిమా వేయడంతో బేబీ జాన్ మూవీ తమకు వద్దంటే వద్దని నానా రచ్చ చేశారు. ఎలాంటి సమాచారం లేకుండా సినిమా మార్చేయడం పట్ల యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారంటే అర్ధం చేసుకోవచ్చు  నార్త్ లో పుష్ప -2 క్రేజ్. ఈ వీకెండ్ నాటికి పుష్ప -2 రూ. 800 కోట్ల క్లబ్ లో చేరడం ఖాయంగా కనిపిస్తుంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *