ఫోటో మూమెంట్: మెగాస్టార్ చిరంజీవితో ‘పుష్ప-2’ మేకర్స్ | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

టాలీవుడ్ ప్రెస్టీజియస్ సీక్వెల్ మూవీ ‘పుష్ప-2’ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తోంది. ఈ సినిమాతో ఐకాన్ అల్లు అర్జున్ తన యాక్టింగ్‌తో వేరే లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ అందించాడని అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక ఈ సినిమాను జీనియస్ డైరెక్టర్ సుకుమార్ మలిచిన తీరుకి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

‘పుష్ప-2’ మూవీకి అన్ని చోట్ల పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో చిత్ర దర్శకుడు సుకుమార్, మైత్రీ నిర్మాతలు రవి, నవీన్, సీఈవో చెర్రీ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. మెగాస్టార్ ఆశీస్సులు తీసుకున్న ‘పుష్ప-2’ టీమ్‌కి చిరంజీవి తన బెస్ట్ విషెస్ తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని మరింత ముందుకు తీసుకుళ్తున్నందుకు సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇక సుకుమార్ తన నెక్స్ట్ చిత్రాన్ని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో చేయనున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్టు పనులను త్వరలోనే ప్రారంభించనున్నాడు.

The post ఫోటో మూమెంట్: మెగాస్టార్ చిరంజీవితో ‘పుష్ప-2’ మేకర్స్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *