హిందీలో “పుష్ప 2” మొదటి వర్కింగ్ డే వసూళ్ల డీటెయిల్స్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 10, 2024 1:13 PM IST


పాన్ ఇండియా సినిమా దగ్గర ఇపుడు కొత్త సూపర్ స్టార్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ సెన్సేషనల్ హిట్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ చిత్రం కోసం ఒక్క తెలుగు రాష్ట్రాల ఆడియెన్స్ మాత్రమే కాకుండా హిందీ జనం కూడా ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్నారు. మరి హిందీలో ఊహలకి మించే పుష్ప 2 వండర్స్ సెట్ చేస్తుంది.

మొదటి వారాంతంలోనే భారీ రికార్డులు మార్జిన్ తో సెట్ చేసిన పుష్ప 2 ఇపుడు మొదటి వర్కింగ్ డే కి కూడా చేరుకొని సెన్సేషన్ ని సెట్ చేసింది. ఇలా ఐదో రోజు పుష్ప 2 భారీ వసూళ్లు అందుకున్నట్టుగా బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇలా అక్కడి పి ఆర్ లెక్కల ప్రకారం నిన్న సోమవారం పుష్ప 2 చిత్రం 48 కోట్ల నెట్ వసూళ్లు అందుకొని అదరగొట్టింది. దీనితో ఇలా మొత్తం 5 రోజుల్లో 339 కోట్ల గ్రాస్ ని ఈ సినిమా అందుకొని దుమ్ము లేపింది. ఇక ఈ వీక్ కి అయితే ఈజీగా 400 కోట్ల మార్క్ ని పుష్ప 2 దాటేస్తుందట.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *