Published on Dec 6, 2024 2:15 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” ఇపుడు రికార్డు వసూళ్లతో వరల్డ్ వైడ్ విడుదల అయ్యిన ప్రతీ చోటా బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఓపెనింగ్స్ ని పుష్ప 2 సాధించగా ఇపుడు మొదట రోజు నైజాం మార్కెట్ లో అయితే భారీ ఓపెనింగ్స్ ని సాధించి ఆల్ టైం రికార్డు కొట్టినట్టుగా కన్ఫర్మ్ అయ్యింది.
మరి లేటెస్ట్ పి ఆర్ లెక్కల ప్రకారం పుష్ప 2 ఏకంగా 25 కోట్లకి పైగా షేర్ ని ఒక్క నైజాంలోనే అది కూడా ఒక్క రోజు లోనే రాబట్టేయడం విశేషం. దీనితో గతంలో ఉన్న అన్ని రికార్డులు బ్రేక్ అయ్యి ఇపుడు పుష్ప 2 పేరిట ఆల్ టైం రికార్డు సాలిడ్ మార్జిన్ తో నమోదు అయ్యింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రం రెండో రోజు నుంచి వీకెండ్ వరకు కూడా నైజాంలో బుకింగ్స్ సూపర్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. మరి ఈ కొన్ని రోజుల్లో లెక్కలు ఎక్కడ ఆగుతాయో చూడాల్సిందే.