Pushpa -2 : హిందీ మూడు రోజుల కలెక్షన్స్.. ఊచకోత.!

మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా నడిచిన సినిమా పుష్ప -2. డిసెంబరు 5న  ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా పుష్ప 1కు సీక్వెల్ గా తెరకెక్కింది. సుమారు పార్ట్ 1 వచ్చిన రెండు సంవత్సరాల తర్వాత విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.  సునీల్, ఫాహద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతిబాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు.

Also Read : AlluArjun : పుష్ప -2 సాధించిన రికార్డ్స్ లో కొన్ని

కాగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాలను మించి హిందీలో కలెక్షన్స్ రాబడుతోంది. బాలీవుడ్ లో ఈ రేంజ్ కలెక్షన్స్ తో ట్రెండ్ సెట్ చేస్తోంది పుష్ప 2. విడుదలైన మొదటి రోజు పుష్ప – 2 ఏకంగా రూ. 72 కోట్లు కలెక్షన్స్ రాబట్టి తెలుగు సినిమా స్టామినా హిందీ స్టార్ హీరోస్ కు మరోసారి రుచి చూపించింది. ఇక రెండవ రోజు రూ. 59 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది పుష్ప -2. ఇక మూడవ రోజు శనివారం మొదటి రోజు కంటే మరింత ఎక్కువగా రూ. 74 కోట్లు కొల్లగొట్టి ఇండియన్ సినిమా బాక్సాఫీస్ ని షేక్ చేసింది. తన మాస్ పెర్ఫామెన్స్ తో అల్లు అర్జున్ అదరగొడుతున్నాడు. హిందీ సినిమాల చరిత్రలో ఓక రోజులూ హయ్యెస్ట్ కలెక్షన్స్ సాధించిన సినిమాగా రికార్డు క్రియేట్ చేస్తూ మూడు రోజులకు గాను మొత్తంగా రూ. 205  కోట్లు కలెక్షన్స్ రాబట్టింది. నేడు ఆదివారం కావడంతో కలెక్షన్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *