ప్రస్తుతం దేశవ్యాప్తంగా రికార్డులు కొల్లగొడుతోంది సెన్సేషనల్ మూవీ ‘పుష్ప-2’. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ సినిమా మాస్ ఫీస్ట్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో బన్నీ పర్ఫార్మెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ప్రీమియర్స్‌కి సాలిడ్ రెస్పాన్స్ రావడం, తొలి రోజే బాక్సాఫీస్ లెక్కలు పీక్స్‌లో ఉండటంతో ఈ మూవీకి రెండో రోజు కూడా అంతే భారీ వసూళ్లు వచ్చినట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. ఇక రెండు రోజుల్లోనే ‘పుష్ప-2’ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.500 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టినట్లుగా మేకర్స్ తాజాగా వెల్లడించారు.

తాము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ లభిస్తుందని.. ఈ సినిమా ఎక్కడ వరకు వెళ్తుందో ఇప్పట్లో చెప్పడం కష్టమని డిస్ట్రిబ్యూటర్స్ చెబుతున్నారని చిత్ర నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు. ఇక ఈ సినిమా టోటల్ రన్‌లో ఎలాంటి సెన్సేషనల్ వసూళ్లు రాబడుతుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

The post 500 కోట్లు కొల్లగొట్టిన ఫాస్టెస్ట్ మూవీగా పుష్ప-2! first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *