Pushpa 2 :  పుష్ప -2 లేటెస్ట్ టికెట్ ధరలు ఇవే.!

  • నేటి నుండి తగ్గనున్న పుష్ప టికెట్ ధరలు
  • ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడతారని అంచనా
  • మండే టెస్ట్ ఎదుర్కొనబోతున్న పుష్ప -2

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప2: ది రూల్‌’ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తోంది. డిసెంబరు 5న రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ.621 కోట్లుగ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. కాగా ఈ సినిమా రిలీజ్ టైమ్ నుండి ఓ కంప్లైంట్ ఉంది. అదే టికెట్ ధర. ఈ సినిమాను డిసెంబరు 4న ప్రీమియర్స్ తో రిలీజ్ చేసారు. ప్రీమియర్స్ కు రూ. 1000 సింగిల్ స్క్రీన్స్ లో ఖరారు చేస్తూ నిర్మాతలు జీవో తెచుకున్నారు. ఇక ముల్టీప్లెక్స్ లో అయితే ఆ ధర ఇంకాస్త పెరిగి రూ. 1200 గా ఫిక్స్ చేసారు.

Also Read : Niharika Konidela : నిగమ్ తో నిహారిక రొమాంటింక్ సాంగ్.. చలి కాలంలో చెమటలు గ్యారెంటీ

ఇక రిలీజ్ రోజు నుండి గడచిన ఆదివారం వరకు సింగిల్ స్క్రీన్స్ లో రూ. 300, మల్టిప్లెక్స్ లో రూ. 500 చెల్లించాల్సి వచ్చింది. దింతో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూడాలి అంటే కాస్త భారంగా అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో టికెట్ ధరలను ప్రభుత్వం ఇచ్చిన జీవో కంటే ఇంకా తక్కువ ఉండేలా ఫిక్స్ చేసారు మేకర్స్. డిసెంబరు 9 అనగా ఈ సోమవారం నుండి సింగిల్‌ స్క్రీన్‌లో రూ.200, మల్టీప్లెక్స్‌లో రూ.395గా ఉండేలా నిర్ణయించారు మైత్రీ నిర్మాతలు. అటు ఏపీలోను రెండవ రోజు నుండి టికెట్ ధరను తగ్గించి సింగిల్ స్క్రీన్స్ లోరూ. 220, ముల్టీప్లెక్స్ లో రూ. 300 – 400 మధ్యలో ఉండేలా ఫిక్స్ చేసారు. ఆన్ లైన్ లో బుక్ చేసుకుంటే జీఎస్టీ అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. తగ్గించిన ధరలతో సినిమా చూసే వారు పెరుగుతారు అని టీమ్ భావిస్తోంది.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *