1000 కోట్ల క్లబ్ లోకి యునానిమస్ గా అల్లు అర్జున్!? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘పుష్ప-2’ రికార్డుల వర్షం కురపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ ట్రీట్‌ను అభిమానులు పిచ్చపిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన అన్ని చోట్లా సాలిడ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తోంది. అయితే, ఈ సినిమాలోని కొన్ని సీన్స్‌ను కొందరు సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలోని ఓ డైలాగ్‌ని కల్పితంగా మార్చి వాటిని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేస్తున్నారు.

పుష్ప-2 లో ‘బాసు’ అనే డైలాగ్ ఓ వర్గం అభిమానుల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయంటూ కొందరు హేటర్స్ నెట్టింట వైరల్ చేస్తున్నారు. సినిమాలో ఉన్న డైలాగుని మార్చి అభిమానుల మధ్య చిచ్చు పెట్టే విధంగా మార్చడంతో ‘పుష్ప-2’ మేకర్స్ మండిపడ్డారు. తాజాగా వారు దీనికి సంబంధించి ఓ వార్నింగ్ కూడా ఇచ్చారు. సొంత క్రియేటివిటీతో, ఊహాజనితమైన డైలాగులను ‘పుష్ప-2’ మూవీలోనివి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం మానకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మైత్రీ మూవీ మేకర్స్ ట్రోలర్స్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఈ వార్నింగ్‌తోనైనా ఇలాంటి నెగెటివ్ ప్రచారం చేయకుండా ఉంటారని వారు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాల రష్మిక మందన్న, ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, సునీల్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు.

The post బాసు డైలాగులపై కేసు.. ‘పుష్ప-2’ మేకర్స్ వార్నింగ్ first appeared on Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *