Published on Dec 8, 2024 7:03 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “పుష్ప 2” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ బిగ్గెస్ట్ చిత్రం ఎన్నో అంచనాలు నడుమ వచ్చి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు అందుకుంటుంది. ఇక మెయిన్ గా హిందీ మార్కెట్ లో అయితే పుష్ప 2 తాండవం చేస్తుంది అని చెప్పాలి.
అక్కడ ఆల్రెడీ మొదటి రోజే 70 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకొని ఆల్ టైం రికార్డు కొడితే ఇపుడు కేవలం మూడు రోజుల్లోనే 200 కోట్ల క్లబ్ లో చేరిపోయి సెన్సేషనల్ గా మారింది. మరి హిందీ సినిమా చరిత్రలో ఒక సినిమా రెండు రోజులు 70 కోట్లు మార్క్ దాటింది లేదు కానీ పుష్ప 2 మొదటి రోజు సహా మూడో రోజు కూడా 70 కోట్ల మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సెట్ చేసింది. ఇదంతా ఒక్క ఇండియా లోనే కావడం విశేషం.
అయితే హిందీ మార్కెట్ లో వసూళ్లు ఒక్కసారి క్లిక్ అయ్యాయి అంటే ఆగేది ఉండదు భారీ జంప్ కూడా ఊహించని రీతిలో ఉంటుంది. అయితే హిందీ మార్కెట్ లో ఆదివారం హాలిడే ఒక బిగ్ డే అని చెప్పాలి. ఇలా హిందీలో ఓ హిట్ సినిమాకి ఆదివారం రికార్డు జంప్ ఉంటుంది. మరి ఇలా వర్కింగ్ డేస్ లోనే 70 కోట్లు అందుకున్న పుష్ప 2 ఫుల్ హాలిడే రోజు సింగిల్ డే లో 100 కోట్లు నెట్ వసూళ్లు కొట్టినా ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఒకవేళ ఇదే జరిగితే మాత్రం ఇదొక కొత్త చరిత్ర అని చెప్పొచ్చు. మరి పుష్ప 2 ఈ సెన్సేషనల్ ఫీట్ ని కూడా సాధిస్తుందో లేదో చూడాలి.