Published on Dec 6, 2024 3:00 AM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లేటెస్ట్ సెన్సేషన్ ‘పుష్ప-2’ బాక్సాఫీస్ దగ్గర తాండవం చేస్తోంది. ఈ సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డులకు ఎసరు పెట్టాడు. ఇప్పటికే పలు కొత్త రికార్డులు ఈ సినిమా తన పేరు నమోదు చేసుకుంటోంది.
తాజాగా నైజాం ఏరియాలో ‘పుష్ప-2’ నెవర్ బిఫోర్ రికార్డును క్రియేట్ చేయబోతున్నట్లు సినీ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు. ఈ సినిమా టికెట్ బుకింగ్స్ విధ్వంసం చూసి వారు ఈ అంచనాలు వేస్తున్నారు. పుష్ప-2 మూవీ తొలి రోజు నైజాం ఏరియాలో ఏకంగా రూ.30 కోట్ల మేర షేర్ వసూళ్లు రాబట్టవచ్చు అని వారు చెబుతున్నారు. బాక్సాఫీస్ ట్రేడ్ వర్గాల రిపోర్ట్ చూస్తే ఇది స్పష్టమవుతుంది.. దీంతో నైజాంలో ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ పేరిట ఉన్న హయ్యెస్ట్ డే 1 ఓపెనింగ్ రికార్డుకు పుష్ప ఎసరు పెట్టాడని చెప్పాలి.
ఇక పుష్ప-2 మొత్తం వరల్డ్‌వైడ్‌లో కూడా స్టన్నింగ్ లెక్కలు నమోదు చేస్తాడని.. ఈ దూకుడు మరింత ముందుకు వెళ్లడం ఖాయమని పలువురు కామెంట్ చేస్తున్నారు. మరి పుష్ప-2 ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.