Pushpa 2: ‘పుష్ప-2’ ట్రైలర్ వచ్చేది అప్పుడేనా..? | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Dec 7, 2024 12:02 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా హీరోయిన్ గా దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన అవైటెడ్ పాన్ ఇండియా సీక్వెల్ చిత్రం “పుష్ప 2 ది రూల్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఎన్నో అంచనాలు నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ చిత్రం పాన్ ఇండియా వైడ్ గా రికార్డులు బ్రేక్ చేసి భారీ మార్జిన్ లతో కొత్త రికార్డులు సెట్ చేసింది. అయితే పుష్ప 2 తో బన్నీ యూఎస్ మార్కెట్ లో కూడా భారీ వసూళ్లు రాబడుతున్నాడు.

ఇలా నార్త్ అమెరికా ప్రాంతంలో ఏకంగా 6 మిలియన్ మార్క్ ని కేవలం ప్రీమియర్స్ డే 2 పూర్తయ్యే సరికే కొట్టేసాడు. దీనితో నార్త్ అమెరికాలో పుష్ప 2 వసూళ్లు వితిన్ నో టైం రికార్డు మైల్ స్టోన్ లని అందుకుంటూ వెళ్ళిపోతుంది అని చెప్పాలి. ఇక ఈ వీకెండ్ లో పుష్ప 2 నంబర్స్ ఓవరాల్ గా 10 మిలియన్ దాటేసినా కూడా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ అలాగే సుకుమార్ రైటింగ్స్ నిర్మాణం వహించారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *