Pushpa -2 : బుక్ మై షో ‘కింగ్’ గా ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్

  • బాక్సాఫీసు రూల్ చేస్తున్న పుష్పరాజ్
  • కెనడాలో ఆల్‌టైమ్ రికార్డు
  • 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రప్ప రప్ప

Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 దెబ్బకి బాక్సాఫీస్ బద్దలైంది. పలు రికార్డులు బ్రేక్ అయ్యాయి. కానీ రెండంటే రెండు రికార్డులు మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. వైల్డ్ ఫైర్‌ బ్లాక్‌బస్టర్‌ నాలుగు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా 1800 కోట్ల గ్రాస్‌ వసూలు చేసింది’ అని పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. దీంతో.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ చేయడానికి ఒకే ఒక్క అడుగు దూరంలో ఉంది పుష్ప2. 2017లో దర్శక ధీరుడు రాజమౌళి, రెబల్ స్టార్ ప్రభాస్ కాంబినేషన్లో వచ్చిన బాహుబలి 2.. పాన్ ఇండియా సినిమాలకు పునాది వేస్తూ.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసి.. ఏకంగా 1810 కోట్లు రాబట్టి సంచలనం సృష్టించింది.

Read Also: Supreme court: యూనివర్సిటీల్లో కుల వివక్ష.. యూజీసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

ఈ సినిమా రిలీజ్ అయి ఎనిమిదేళ్లు కావొస్తున్నా.. ఇప్పటి వరకు మరో సినిమా దీని దరిదాపుల్లోకి కూడా వెళ్లలేదు. ఆర్ఆర్ఆర్ కూడా 1300 కోట్ల దగ్గరే ఆగిపోయింది. కానీ ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ చేసిన మాస్ తాండవానికి అన్ని రికార్డులు బద్దలయ్యాయి. మరో పది కోట్లు రాబడితే చాలు.. బాహుబలి 2 రికార్డ్ బ్రేక్ అయి టాప్ 2లో కూర్చొనుంది పుష్ప2. అమీర్ ఖాన్ ‘దంగల్’ సినిమా 2 వేల కోట్లతో టాప్ ప్లేస్‌లో ఉన్న తెలసిందే. ఈ రికార్డ్‌ను కూడా పుష్పగాడు బద్దలు చేసేలా ఉన్నాడు.

Read Also: Gold Price : పసిడి ప్రియులకు శుభవార్త.. భారీగా తగ్గిన బంగారం ధర

ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పుష్ప 2’ రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ కెనడాలో ఏకంగా 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రఫ్ఫాడించింది. కెనడాలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది. గతంలో ‘కల్కి 2898 ఎడి’ 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లే్స్‌లో నిలిచింది. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *