మొల్లేటి ‘పుష్ప’రాజు విధ్వంసం..1000 కోట్లతో చరిత్ర తిరగరాసిన అల్లు అర్జున్.. | Latest Telugu Movie News, Reviews, OTT, OTT Reviews, Ratings

Published on Jan 3, 2025 10:58 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప 2’ బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతూ దూసుకెళ్తుంది. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ తెరకెక్కించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ మూవీ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ దాదాపు రూ.1800 కోట్లు వసూళ్లు రాబట్టి సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ఇటు ఇండియాతో పాటు ఓవర్సీస్‌లోనూ ‘పుష్ప 2’ రికార్డులను తిరగరాస్తుంది. ఈ మూవీ కెనడాలో ఏకంగా 4.13 మిలియన్ డాలర్ల వసూళ్లతో రఫ్ఫాడించింది. కెనడాలో ఈ స్థాయిలో కలెక్షన్లు రాబట్టిన హైయెస్ట్ గ్రాసింగ్ సౌత్ ఇండియన్ మూవీగా ‘పుష్ప 2’ నిలిచింది. గతంలో ‘కల్కి 2898 ఎడి’ 3.5 మిలియన్ డాలర్లతో టాప్ ప్లే్స్‌లో నిలిచింది.

ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేశారు.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *