Published on Dec 7, 2024 10:00 PM IST
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ ‘పుష్ప-2’ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తూ రికార్డుల భరతం పడుతోంది. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన ఈ మాస్ విజువల్ ట్రీట్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఇక ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ వండర్స్ క్రియేట్ చేస్తోంది.
ఈ సినిమా కేవలం ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మాత్రమే కాకుండా ఓవర్సీస్ బాక్సాఫీస్ దగ్గర కూడా సరికొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. ఈ చిత్రం నార్త్ అమెరికాలో రెండు రోజుల్లో ఏకంగా 6.03 మిలియన్ డాలర్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త సెన్సేషన్‌గా నిలిచింది. వీకెండ్‌లో ఈ వసూళ్లు మరింతగా పెరగడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
అల్లు అర్జున్ పవర్‌ఫుల్ యాక్టింగ్‌కు ఫ్యాన్స్ నీరాజనాలు పడుతున్నారు. ఇక ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించగా ఫహాద్ ఫాజిల్, సునీల్, రావు రమేష్, అనసూయ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేశారు.